ETV Bharat / state

నందిగామలో భారీ ర్యాలీ.. జీవో నెం1 వైసీపీకి వర్తించదా..! - నందిగామలో వైసీపీ ర్యాలీ

YCP Rally Against G.O No 1: ఆంక్షలు, చట్టాలు కేవలం ప్రతిపక్షాలకే కానీ అధికార పార్టీకి కాదా అని టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ పార్టీ నాయకులు. రోడ్ల మీద సభలు, సమావేశాలు పెట్టకూడదని.. ప్రభుత్వం విడదల చేసిన జీవోని పక్కన పెట్టి.. నందిగామలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా మహమ్మద్ మస్తాన్ ప్రమాణ స్వీకార సందర్బంగా ర్యాలీ చేపట్టారని ఆరోపించారు.

rally
rally
author img

By

Published : Jan 5, 2023, 4:54 PM IST

YCP Rally Against G.O No 1: వైసీపీ ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన జీవో నంబర్‌ 1కి విరుద్ధంగా ఆ పార్టీ నాయకులే భారీ ర్యాలీ నిర్వహించిన ఘటన ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో జరిగింది. నందిగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా మహమ్మద్ మస్తాన్ నియమితులయ్యారు. మస్తాన్‌ ప్రమాణస్వీకారం సందర్భంగా నందిగామలో వైసీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. అడుగడుగునా బాణాసంచా కాలుస్తూ ముందుకు సాగారు. వైసీపీ కార్యకర్తలు బైక్ ర్యాలీతో హంగామా చేశారు. ప్రధాన వీధుల్లో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది.

నందిగామలో వైసీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

ప్రభుత్వ జీవోకు విరుద్ధంగా ర్యాలీ నిర్వహిస్తున్నప్పటికీ పోలీసులు నిలువరించకపోగా బందోబస్తు నిర్వహించడం గమనార్హం. భారీ ర్యాలీ చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదని టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.