ETV Bharat / state

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 9 PM - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు

.

ఏపీ ప్రధాన వార్తలు
TOP NEWS
author img

By

Published : Nov 18, 2022, 9:01 PM IST

  • హెటిరో సంస్థలకు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం
    జగన్ అక్రమాస్తుల కేసులో హెటిరో సంస్థలకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తమపై కేసు కొట్టివేయాలన్న అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఏ-1గా ఉన్న జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టాకే హెటిరోకు భూములు కేటాయించారని.. క్విడ్‌ ప్రోకో జరిగినట్లు స్పష్టంగా కనిపిస్తున్న ఈ కేసు కొట్టివేయదగినది కాదని తేల్చిచెప్పింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • భారత అంతరిక్షయాన రంగంలో మరో చారిత్రక ఘట్టం.. "మిషన్​ ప్రారంభ్​" విజయవంతం
    భారత అంతరిక్షయాన రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది. తొలిసారి ఓ ప్రైవేటు సంస్థ రూపొందించిన రాకెట్‌ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. 3 ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్‌ ఏరోస్పేస్‌ అంకురసంస్థ రూపొందించిన విక్రమ్‌-S రాకెట్‌.. అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • హాస్టళ్లలో పిల్లలకు మంచి వాతావరణం ఉండేలా చూడాలి: సీఎం
    గురుకుల పాఠశాలలు, హాస్టళ్ల ఆధునికీకరణకు 3వేల 364 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మూడు దశల్లో నాడు - నేడు ద్వారా పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వసతిగృహాల్లో ఉద్యోగ ఖాళీల భర్తీకి పచ్చజెండా ఊపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఓడిపోతారని తెలిసే.. ప్రాంతాల మధ్య జగన్ చిచ్చు పెడుతున్నారు: చంద్రబాబు
    మూడు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి సీఎం జగన్‌ చలికాచుకుంటున్నారని.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. రాయలసీమ ద్రోహి జగనేనన్నారు. కర్నూలు జిల్లాకు ఎవరేమి చేశారో తేల్చుకోవడానికి చర్చకు రావాలని అధికార పార్టీకి సవాల్​ విసిరారు. మూడు రాజధానులు అంటున్న వారంతా.. అమరావతి రాజధానికి జగన్‌ అంగీకరించినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి.. 700 అడుగుల లోతు లోయల పడ్డ వాహనం
    ఉత్తరాఖండ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చమోలీ జిల్లాలోని ఉగ్రం-పల్ల జఖోలా రహదారిలో ఓ టాటా సుమో ప్రమాదానికి గురైంది. 12 మంది ప్రయాణికులతో వెళ్తున్న వాహనం అదుపు తప్పి 700 మీటర్ల లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా 12 మంది చనిపోయారు. సమాచారం అందుకున్న చమోలీ డీఎమ్​, ఎస్​ఎస్​పీ, ఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఘోర ప్రమాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న వంతెన.. ఇద్దరు మృతి
    బిహార్​లో నిర్మాణంలో ఉన్న నాలుగు వరుసల వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మరోసారి క్షిపణిని ప్రయోగించిన 'కిమ్'​ సర్కార్.. అమెరికా హెచ్చరికలు బేఖాతర్​
    ఉత్తర కొరియా మరోసారి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని చేపట్టింది. ఉత్తర తూర్పుతీరంలో బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగాన్ని గుర్తించినట్లు దక్షిణ కొరియా తెలిపింది. అది కిమ్‌ సర్కార్ రూపొందించిన దీర్ఘశ్రేణి క్షిపణేనని.. అణ్వాయుధాలను కూడా మోసుకెళ్తుందని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కొంపముంచిన మస్క్​ అల్టిమేటం.. ట్విట్టర్​లో గందరగోళం.. రాజీనామాకు ఉద్యోగులు సిద్ధం
    ట్విట్టర్​ను నిజమైన వాక్‌ స్వేచ్ఛకు వేదికగా మారుస్తానంటూ చెప్పిన మస్క్‌.. ఇప్పుడు సంస్థలో తీవ్ర గందరగోళానికి కారణమయ్యారు. ఆయన తీసుకుంటున్న అనూహ్య నిర్ణయాలతో ఉద్యోగులు విసుగెత్తినట్లు తెలుస్తోంది. ఉంటారా.. వెళ్తారా.. అంటూ ఆయన జారీ చేసిన అల్టిమేటం మొదటికే మోసం తెచ్చినట్లుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వామ్మో.. ఇదేం తిండి.. అవేం ధరలు.. ఫ్యాన్స్​కు మైండ్​ బ్లాక్​​
    ఖతార్‌ వేదికగా నవంబర్ 20 నుంచి ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచ కప్‌ 2022 ప్రారంభం కానుంది. అయితే తమ అభిమాన జట్టు మ్యాచ్‌ను వీక్షించాలనే ఆశతో వచ్చిన వారికి ఆహార ధరలను చూసి దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. మ్యాచ్‌లను చూస్తూ ఖతార్‌లో ఆనందంగా గడుపుదామని వచ్చిన వారు తీవ్ర నిరాశకు గురయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పవర్​ఫుల్​గా విశ్వక్​ 'దమ్కీ' ట్రైలర్​.. బాలయ్య చేతుల మీదగా రిలీజ్​
    విశ్వక్‌సేన్‌ కథానాయకుడిగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్‌ ఇండియా మూవీ 'దాస్‌ కా దమ్కీ'. నివేదా పేతురాజు కథానాయిక. శుక్రవారం ఈ చిత్ర ట్రైలర్‌ను అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ విడుదల చేశారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.