Water Problem for Ganesh Immersion: వినాయక విగ్రహాలకు భక్తులు మూడు రోజులపాటు ఘనంగా పూజలు చేశారు. భక్తి శ్రద్ధలతో ఊరేగింపు నిర్వహించి గణనాథులను గంగమ్మ చెంతకు చేర్చారు. కానీ చెరువులో విగ్రహాలు మునిగేందుకు సరిపడా నీళ్లు లేక విగ్రహాలన్నీ పైకి తేలుతున్న ఘటన నంద్యాల జిల్లాలోని డోన్‌లో జరిగింది. శుక్రవారం అబ్బిరెడ్డిపల్లి చెరువులో మునిసిపల్ అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో రెండు క్రేన్ల సహాయంతో వినాయక నిమజ్జనం నిర్వహించారు. అయితే విగ్రహాలన్నీ నీళ్లలో మునగక బయటకు కనిపిస్తున్నాయి. విగ్రహాలను ఇంకా కొంచెం లోపలికి వేసుంటే బాగుండేదని పలువురు ఆభిప్రాయపడుతున్నారు. రైతులు, ప్రజలకే కాదు దేవునికీ నీళ్ల కష్టాలు తప్పడం లేదంటున్నారు.
హంద్రీనీవా నీళ్లు విడుదల చేసుంటే చెరువు నిండేదని.. గణేశ్ విగ్రహాలు పూర్తిగా మునిగి ఉండేవని ప్రజలంటున్నారు. గణనాయకులను నీటిలో పూర్తిగా మునిగేటట్లు అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: