నంద్యాల జిల్లా శ్రీశైలం కెనరా బ్యాంకులో రూ.80 లక్షల కుంభకోణం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. బ్యాంకు మేనేజర్‌తో పాటు గోల్డ్ అప్రైజర్‌ను అరెస్టు చేసినట్లు శ్రీశైలం సీఐ బీవీ రమణ స్పష్టం చేశారు. ఈ కేసు విచారణలో మేనేజర్ శివనాగేశ్వరరావు, గోల్డ్ అప్రైజర్ కుమార్ ప్రమేయం ఉన్నట్లు తేలిందని సీఐ వెల్లడించారు. ఆత్మకూరు కోర్టుకు నిందితులను తరలిస్తున్నామని తెలిపారు. నిందితులు నకిలీ బంగారం, పత్రాలు సృష్టించి రుణాలు కొల్లగొట్టినట్లు చెప్పారు. ఎంఎస్‌ఎంఈ రుణాల మోసాలపై కూడా దర్యాప్తు సాగుతోందని సీఐ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: Canara Bank Cheating: కెనరా బ్యాంకు అధికారుల మోసం...రుణాలిచ్చి బురిడి కొట్టించారు -బాధితులు