ETV Bharat / state

ప్రాణాలు పోతున్నాయ్.. మరో రహదారి చూపండి మహాప్రభూ - Road accidents in AP

Protest To Buggana: రోజురోజుకు రోడ్డు ప్రమాదంలో మరణాలు ఎక్కువైపోతున్నాయి. నంద్యాలలో జాతీయ రహదారి దాటుతుండగా వాహనం ఢీకొని ముగ్గురు చనిపోయారు. పరామర్శించడానికి వెళ్లిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ను గ్రామస్థులు అడ్డుకున్నారు.

Protest
Protest
author img

By

Published : Jan 16, 2023, 10:25 AM IST

Protest To Buggana: పండగ వాతావరణం వేళ వారి జీవితాల్లో చీకటి అలుముకుంది. బయటకు వెళ్లిన తమ కుమారులు వస్తారని తమ చేతులతో చేసిన పిండి వంటలు తింటారనీ వారు వెయ్యి కళ్లతో ఎదురు చూశారు. కానీ వారి రాకపోగా.. వారి చావు వార్త విని అందరూ ఒక్కసారిగా కుదేలైయారు. ఈ ఘటన నంద్యాల జిల్లాలో జరిగింది. పండుగ పూట జాతీయ రహదారి దాటుతుండగా వాహనం ఢీకొని ముగ్గురు చనిపోయారు. ఈ వార్త తెలుసుకుని బాధిత కుటుంబాళను పరామర్శించడానికి వెళ్లిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌కు చుక్కెదురైంది. బాధిత కుటుంబ సభ్యులు మంత్రిని అడ్డుకున్నారు.

ప్రాణాలు పోతున్నాయ్.. మరో రహదారి చూపండి మహాప్రభూ

ఐచర్‌ ఢీకొని..ముగ్గురు మృతి: నంద్యాల జిల్లా డోన్ మండలం దొరపల్లి గ్రామంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌కు నిరసన సెగ తగిలింది. గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు జాతీయ రహదారి దాటుతుండగా ఐచర్‌ ఢీకొని మృతి చెందారు. మృతుల కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన మంత్రిని గ్రామస్థులు అడ్డగించారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో గ్రామ ప్రజలు మంత్రిపై ఆగ్రహానికి లోనయ్యారు. గ్రామానికి ప్రత్యామ్నాయ రహదారి చూపాలంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసుల బలగాలతో గ్రామస్థులను చేదరగొట్టే ప్రయత్నం చేశారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ముందు కూర్చోని ఆందోళనకు దిగారు. రైల్వే అధికారులతో మాట్లాడి చెప్తానని మృతుల కుటుంబాలను పరామర్శించకుండానే.. సమాధానం చెప్పలేక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ వెనుతిరిగారు.

పిల్లలు పాఠశాలకు వెళ్లడానికి టిక్కెట్ చార్జీలు పెంచారు. ఈ రోడ్డు ద్వారా ప్రయాణించాలంటే భయంగా ఉంది. ప్రమాదంలో వయస్సులో ఉన్న పిల్లలు చనిపోయారు. ఈ రోడ్డు వేయాలని మరీ మరీ కోరుకుంటున్నాము. మీరు ప్రభుత్వంలో పదవిలో ఉన్నందుకు రోడ్డు వేయాలనీ కోరుకుంటున్నాము. మగపిల్లలు, ఆడపిల్లలు ఉంటే మగపిల్లలనే చదవించుకుంటున్నాం. -స్థానికురాలు

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.