ETV Bharat / state

ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి కన్నుమూత.. గవర్నర్​ సంతాపం - హైదరాబాద్

CHALLA BHAGHEERATHA REDDY: వైకాపా ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి అనారోగ్య సమస్యతో హైదరాబాద్​లో తుదిశ్వాస విడిచారు. ఊపిరితిత్తుల సమస్య వల్ల చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

Challa Bhagiratha Reddy
చల్లా భగీరథరెడ్డి
author img

By

Published : Nov 2, 2022, 5:39 PM IST

Updated : Nov 2, 2022, 6:57 PM IST

CHALLA BHAGHEERATHA REDDY: చల్లా రామకృష్ణారెడ్డి కుమారుడు, నంద్యాల జిల్లా అవుకు ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి (46) అనారోగ్యంతో నేడు కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కొద్ది రోజులుగా కాలేయ సమస్యతో బాధపడుతున్న ఆయన.. మూడు రోజుల నుంచి తీవ్ర దగ్గుతో బాధపడటంతో చికిత్స కోసం కుటుంబసభ్యులు హైదరాబాద్ తరలించారు. ఊపిరితిత్తుల్లో రక్తస్రావం కావడంతో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

రేపు అవుకులో భగీరథరెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అంత్యక్రియలకు సీఎం జగన్ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. చల్లా భగీరథరెడ్డి భార్య శ్రీలక్ష్మి అవుకు జెడ్పీటీసీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. తండ్రి చల్లా రామకృష్ణారెడ్డి మరణంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ పదవిని.. కుమారుడికి ఇచ్చారు. 2021 మార్చి నుంచి భగీరథరెడ్డి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఆయన మరణంతో అవుకులో విషాదఛాయలు అలుముకున్నాయి.

గవర్నర్​ సంతాపం : వైకాపా నేత, అవుకు ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి మృతిపై గవర్నర్​ బిశ్వభూషణ్​ హరిచందన్​ తీవ్ర దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. చల్లా కుటుంబసభ్యులకు గవర్నర్​ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 2, 2022, 6:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.