AP CM JAGAN: ఉమ్మడి కర్నూలు జిల్లా ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి మృతదేహానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నివాళి అర్పించారు. అనారోగ్యంతో మృతి చెందిన ఎమ్మెల్సీ భగీరథ రెడ్డి భౌతిక గాయానికి అవుకులోని ఆయన స్వగృహంలో సీఎం నివాళి అర్పించి.. కుటుంబ సభ్యులను పరామర్శించారు. సాయంత్రం మూడున్నరకు ప్రత్యేక హెలికాప్టర్లో అవుకు చేరుకున్న ముఖ్యమంత్రి.. ఎమ్మెల్సీ చల్లా నివాసానికి వెళ్లి నివాళులర్పించి కుటుంబ సభ్యులతో పది నిమిషాలపాటు ప్రత్యేకంగా మాట్లాడారు.
2021 మార్చిన ఎమ్మెల్సీగా పదవీ బాధ్యతలు చేపట్టిన చల్లా భగీరథ రెడ్డి అనారోగ్యంతో హైదరాబాదులో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. సుమారు 20 నిమిషాల పాటు ఇంటిలోనే ఉన్న ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులను పరామర్శించి వెనుతిరిగారు. భగీరథరెడ్డి మృతితో అవుకు పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతదేహాన్ని కడసారి చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు.
ఇవీ చదవండి: