ETV Bharat / state

శ్రీశైలం దేవస్థానం ప్రాంగణంలో పేలుడు.. తప్పిన పెను ప్రమాదం - బాయిలర్ పేలుడు

Boiler Blasted : శ్రీశైలంలోని దేవస్థాన ప్రాంగణంలో ప్రమాదం సంభవించింది. దేవస్థానం ప్రాంగణంలోని వంటశాలలోని బాయిలర్​ పేలింది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టమేమి జరగకపోవటంతో ఆలయ సిబ్బంది ఊపిరి పిల్చుకున్నారు.

srisailam
blast
author img

By

Published : Nov 1, 2022, 3:27 PM IST

Boiler Blasted In Srisailam: శ్రీశైలం దేవస్థానం అన్నపూర్ణ భవన్ ప్రాంగణంలో ప్రమాదం జరిగింది. వంటశాలకు చెందిన బాయిలర్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలింది. బాయిలర్ పేలడం వల్ల అందులోని ఎస్​ఎస్​ ట్యాంకు సుమారు 10 అడుగుల మేర ఎగిరిపడి.. రేకుల షెడ్డు పైభాగాన్ని బద్దలు కొట్టింది. ఘటనాస్థలం వద్ద సిబ్బంది ఎవరూ లేక పోవడంతో ప్రాణ నష్టం తప్పింది. పేలుడు శబ్దానికి సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కార్తీక మాసోత్సవాల సందర్భంగా భోజనం, అల్పాహారం వంటివి నిరంతరం తయారు చేయాల్సి రావడంతో.. అధిక వేడి వల్ల బాయిలర్ పేలుడుకు గురైనట్లు సిబ్బంది తెలిపారు. బాయిలర్ ప్రక్కనే చిన్నపాటి గ్యాస్ గోడౌన్ ఉంది. అదృష్టవశాత్తు పైకి ఎగిరిన ట్యాంక్​ అటు వైపు పడకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

శ్రీశైలం దేవస్థానం ప్రాంగణంలో పేలుడు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.