Baireddy comments on Jagan : రాష్ట్ర ప్రభుత్వం రాజధాని విషయంలో మరోసారి కొత్త నాటకానికి తెర తీసిందని.. రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ధ్వజమెత్తారు. నందికొట్కూరులో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో జగన్ సర్కారు ఎదురీత ఈదుతోందని.. సలహాదారులు సరిగ్గాలేరు.. అంతా కలిసి ఆయనను పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. వివేకా హత్య కేసు ఒకవైపు.. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి మరోవైపు నెలకొందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు మూడు పంగనామాలు, మూడు నిలువు నామాలు పెట్టి ఇప్పుడు కొత్తగా ఒకటే నామం పెడతానంటూ కొత్త డ్రామా మొదలు పెట్టారని విమర్శించారు.
ఎగువ భద్ర నిర్మాణం రాయలసీమకు శాపంగా మారబోతోందని... నికర జలాలు రాక వర్షాలు, బోర్లపై ఆధార పడేటట్లు చేయడం చాలా బాధాకరమని అని అన్నారు. ఈ నెల 25న సేవ్ రాయలసీమ అంటూ రాజోలి బండ డైవర్షన్ స్కీమ్(ఆర్డీఎస్) నుంచి పాదయాత్ర మొదలుపెట్టి 28 న 'ఛలో ఆదోని' ప్రజా ప్రదర్శనతో పాలకుల్లో కనువిప్పు కలిగేలా చేస్తామని వివరించారు.
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రాష్ట్రంలో ఎదురీత ఈదుతున్నారు.. సరైన సలహాదారులు ఆయన పక్కన లేక.. ఆయనను అంతా కలిసి పక్కదోవ పట్టిస్తున్నారు. అసలు ఏమాత్రం కూడా పరిపాలన అనేది ఆయన చేతుల్లో లేకుండా జారిపోయింది. అంత మచ్చ తెచ్చి పెట్టుకున్నారు. ఇన్నాళ్లు మూడు రాజధానులు అని ప్రజలకు పంగనామాలు.. నిలువు నామాలు పెట్టుకుంటూ వచ్చి మళ్లి ఇప్పుడు ఒకటే నామం ఆని అంటున్నారు. ఆయన పరిపాలన మొత్తం నాశనం అయిపోవడానికి కారణం ఆ రాజధాని జోలికి వెళ్లడమే.- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఛైర్మన్ రాయలసీమ స్టీరింగ్ కమిటీ
ఇవీ చదవండి :