ETV Bharat / state

Death trap రుణ యాప్​కు మరో విద్యార్ధి బలి.. మార్ఫింగ్ ఫొటో తల్లిదండ్రులకు చేరడంతో ఆత్మహత్య - యువకుడు ఫ్యాన్​కు ఉరివేసుకోని ఆత్మహత్య

Death trap-loan app: రవీంద్రనాథ్ బెంగళూరులో బీటెక్ చదువుతున్నాడు. అవసరాలకోసమంటూ.. యాప్​లో రుణం తీసుకున్నాడు. తీసుకున్న రుణం తిర్చాలంటూ తన తమ్ముడి చరవాణికి అసభ్య సందేశాలు పంపించారు నిర్వాహకులు. అదే విషయమై తల్లిదండ్రులు రవీంద్రనాథ్​ని నిలదిశారు . మనస్తాపానికి గురైన ఆ యువకుడు ఫ్యాన్​కు ఉరివేసుకోని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

harassment of loan apps
రుణ యాప్​
author img

By

Published : Sep 18, 2022, 11:14 AM IST

Updated : Sep 18, 2022, 12:28 PM IST

B Tech student commits suicide: రుణ యాప్‌ల వేధింపులు భరించలేక నంద్యాలలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నంద్యాలలోని బాలాజీ కాంప్లెక్స్ ప్రాంతానికి చెందిన మల్లికార్జున, లక్ష్మీదేవి దంపతులకు ముగ్గురు కుమారులు. చిన్న కుమారుడు 23ఏళ్ల రవీంద్రనాథ్ బెంగళూరులో బీటెక్ చదువుతున్నాడు. 20 రోజుల క్రితం నంద్యాల వచ్చిన రవీంద్రనాథ్‌..ముబావంగా ఉండేవాడు. బీటెక్‌లో కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్‌ కావడం వల్ల..ఇలా ఉన్నాడని కుటుంబ సభ్యులు భావించారు.

శనివారం రవీంద్రనాథ్ సోదరుడి ఫోన్‌కు రుణ యాప్ నిర్వాహకుల నుంచి మార్ఫింగ్ చేసిన రవీంద్రనాథ్ ఫొటో వచ్చింది. మా వద్ద రుణం తీసుకుని చెల్లించలేదని.. రెఫరెన్స్ కోసం మీ ఫోన్ నంబరు ఇచ్చినట్లు మెసేజ్‌లో వివరించారు. రుణం చెల్లించకుంటే పోలీసులు అరెస్టు చేస్తారని అందులో హెచ్చరించారు. దాన్ని చూసిన తల్లిదండ్రులు రుణం తీసుకున్నావా? అని రవీంద్రనాథ్‌ను ప్రశ్నించారు. అది ఫేక్ ఫొటో అని తాను ఎలాంటి రుణం తీసుకోలేదని రవీంద్రనాథ్ చెప్పాడు. తర్వాత గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని ఉరి వేసుకున్నాడని కుటుంబ సభ్యులు వెల్లడించారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.

ఇవీ చదవండి:

Last Updated : Sep 18, 2022, 12:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.