- రాష్ట్రంలో విధ్వంసాలు ఆగాలంటే జగన్ సైకో పాలన పోవాలి: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో విధ్వంసాలు ఆగాలన్నా, రాష్ట్రం బాగు పడాలన్నా.. జగన్ సైకో పాలన పోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. జగన్ విధ్వంస పాలనతో ఐటీ సహా ఇతర పరిశ్రమలు రాష్ట్రం నుంచి తరలిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతో.. సాగునీటి ప్రాజెక్టులు పడకేశాయని మండిపడ్డారు. తెలుగుదేశం పాలనా పగ్గాలు చేపడితే.. వ్యవస్థలన్నింటినీ బాగు చేస్తామని భరోసా ఇచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వైఎస్సార్ జిల్లాలో సీఎం జగన్ మూడు రోజుల పర్యటన.. వివరాలివే..
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేటినుంచి మూడు రోజుల పాటు వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం పదకొండున్నరకు తాడేపల్లిలో బయల్దేరనున్న సీఎం.. కడపకు చేరుకోగానే పెద్దదర్గాను సందర్శిస్తారు. ఆ తర్వాత ప్రభుత్వ సలహాదారు వీరారెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్ మల్లికార్జునరెడ్డి ఇళ్లకు వెళ్లనున్నారు. అనంతరం కడపలో ఓ వివాహ వేడుకకు హాజరవుతారు. మధ్యాహ్నం కమలాపురం వెళ్లనున్న సీఎం.. 900 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆరోగ్యం బాగాలేదని కాలువలోకి దూకిన మహిళ.. ఆ తర్వాత
ఓ మహిళ ఆరోగ్యం బాాగాలేదని కాలువలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన.. విజయవాడ వన్ టౌన్ ఫ్లవర్ మార్కెట్ వద్ద జరిగింది. ఫైర్ సిబ్బంది, గవర్నర్ పేట పోలీసులు.. మహిళను కాపాడి గవర్నర్‌పేట స్టేషన్‌కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బాపట్లలో ఫ్లెక్సీల రగడ.. పరస్పర ఆరోపణలు, పోలీసులకు ఫిర్యాదు
ఇంజనీరింగ్ కళాశాలలో వైసీపీ, టీడీపీల మధ్య ఫ్లెక్సీల రాజకీయం రాజుకుంది. తమ నాయకుడి ఫ్లెక్సీని వైసీపీ నేతలు చించారని ఆరోపిస్తూ టీడీపీ, వైసీపీల నేతలకు చెందిన ఫ్లెక్సీని చించేసిన ఘటనలో ఇరువర్గాల నాయకులు, విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీసులో చిరుత సంచారం
ఉత్తరాఖండ్‌లో చిరుత కలకలం సృష్టించింది. చంపావత్ జిల్లాలోని సీఎం క్యాంపు ఆఫీసులో రాత్రిపూట చిరుత సంచరిస్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. మార్జినల్ టెరాయ్ ప్రాంతాంలోని జనావాసాల చుట్టూ చిరుత కనిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నాలుగేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి రేప్.. మైనర్ కుమార్తెను గర్భవతిని చేసిన తండ్రి
దిల్లీలో నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు, మైనర్ కుమార్తెపై 42 ఏళ్ల తండ్రి అత్యాచారం చేశాడు. బాలిక గర్భం దాల్చగా.. విషయం వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలో ఈ దారుణం జరిగింది. పంజాబ్‌లో ఆరేళ్ల బాలుడిపై 19 ఏళ్ల యువకుడు అత్యాచారం చేశాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- చైనాలో కరోనా విలయం.. ఆస్పత్రులు ఫుల్.. రోజుకు 5వేల మంది మృతి!
కరోనా బాధితులతో చైనాలోని పలు ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. బెడ్ కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మృతదేహాలను భద్రపరిచేందుకు కూడా ఫ్రీజర్లు సరిపోకపోవడం వల్ల మృతి చెందిన రోజునే అంత్యక్రియలు నిర్వహిస్తున్నామని అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఈ ఏడాదే ఉద్యోగంలో చేరారా? పన్ను మాటేంటి?
పరిమితికి మించిన ఆదాయం ఉన్నప్పుడు పన్ను తప్పనిసరిగా చెల్లించాలి. అయితే ఈ పన్నులను భారం తగ్గించుకోవాలంటే ఆదా చేసే పెట్టుబడులను ఎంచుకోవాలి. పన్ను రిటర్నులు దాఖలు చేయడంలో కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. మరి అవేంటో తెలుసుకుందాం రండి.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ను పక్కనబెట్టారా?'.. గావస్కర్ అసహనం
బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో అద్భుతంగా రాణించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన సీనియర్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్‌ను రెండో టెస్టుకు తీసుకోకపోవడం పట్ల టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇంతకీ ఏం అన్నాడంటే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆస్కార్ రేసులో తెలుగమ్మాయి.. అన్ని అడ్డంకులు దాటి ఆఖరికి..
ప్రతిష్ఠాత్మక ఆస్కార్ రేసులో తెలుగమ్మాయి నిలిచింది. జాయ్ ల్యాండ్ అనే చిత్రంతో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ క్యాటగిరీలో షార్ట్ లిస్ట్ అయింది. ఆమె ఎవరంటే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.