ETV Bharat / state

గురుకుల పాఠశాలలో 42 మంది బాలికలకు అస్వస్థత.. ఆసుపత్రిలో నిలిచిన విద్యుత్ - AP Tribal Gurukul Girls School Pud Poisoning

Food Poisoning In Gurukula School: ఇటీవల కాలంలో గురుకుల పాఠశాలల్లో బాలికలు తరచూ అస్వస్థతకు గురవుతున్నారు. తాజాగా నంద్యాల జిల్లా పాణ్యంలో 42 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. కలుషిత ఆహారం ప్రధాన కారణమని తెలుస్తోంది. విద్యార్ధినులకు ఆసుపత్రి క్యాజువాలిటిలో చికిత్స అందిస్తున్న సమయంలో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.

గురుకుల పాఠశాలలో బాలికలు అస్వస్థత
గురుకుల పాఠశాలలో బాలికలు అస్వస్థత
author img

By

Published : Mar 17, 2023, 1:28 PM IST

గురుకుల పాఠశాలలో 42 మంది బాలికలు అస్వస్థత... ఆసుపత్రిలో నిలిచిన విద్యుత్

Food Poisoning In Gurukula School: గురుకుల పాఠశాలల్లోని విద్యార్థినులు తరచూ అస్వస్థతకు గురవుతున్నారు. అక్కడ ఉన్న పరిస్థితులు, వాతావరణం, కలుషిత ఆహారం, పరిసరాల్లో మురుగు నీరు నిల్వ ఉండడం తదితర కారణాలతో విద్యార్థినిలు అస్వస్థతకు లోనవుతున్నారు. రాష్ట్రంలో ఉన్న కొన్ని గురుకుల పాఠశాలలో ఇదే పరిస్థితి. గత నెలలో శ్రీకాకుళం జిల్లా పలాసలోని జ్యోతిబా ఫులే గురుకుల పాఠశాల బాలికలు అస్వస్థతకు గురైయ్యారు. అక్కడ వారు మురుగు నీరు కారణంతో అస్వస్థతకు గురయ్యారని తెలిసింది. తాజాగా నంద్యాల జిల్లాలో 42 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.

మొదట 12 మందికి అస్వస్థత: నంద్యాల జిల్లా పాణ్యం మండలం నెరవాడ గ్రామంలోని ఏపీ గిరిజన గురుకుల బాలికల పాఠశాలకు చెందిన 42 మంది విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. కలుషిత ఆహారమే అస్వస్థతకు కారణంగా ప్రాథమికంగా ధ్రువీకరించారు. గురువారం సాయంత్రం అల్పాహారంలో భాగంగా బొరుగులు తిన్నట్లు బాలికలు తెలిపారు. కడుపు నొప్పితో బాధపడుతున్న12 మంది బాలికలను చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న క్రమంలో వైద్యులు చికిత్స చేసిన తర్వాత బాలికలు కోలుకున్నారు.

భరించలేని కడుపు నొప్పి.. విద్యార్థినుల రోదన : అనంతరం మరో 30 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. వారిని కూడా ఆస్పత్రికి తరలించారు. వారికి పరీక్షలు నిర్వహించి చికిత్స చేశారు. కడుపు నొప్పి భరించలేక విద్యార్థినులు రోదిస్తూ ఇబ్బంది పడ్డారు. అధికారులకు సమాచారం అందడంతో ఆసుపత్రి చేరుకున్నారు. పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అదే రోజు అందజేసిన ఐరన్ మాత్రలను పిల్లలు వేసుకున్నారు. అస్వస్థతకు గురైన వారిలో ఏడు, ఎనిమిది, తొమ్మిది, తరగతులకు చెందిన బాలికలు ఉన్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు తెలిపారు.

విద్యుత్​ లేక ఇక్కట్లు : విద్యార్ధినులకు ఆసుపత్రి క్యాజువాలిటిలో చికిత్స అందిస్తున్న సమయంలో ఐదు నిమిషాల పాటు విద్యుత్తు సరఫరా ఆగిపోయింది. అదే సమయంలో జనరేటర్లు వేయలేదు. దీంతో నర్సులు, సిబ్బంది చరవాణుల వెలుగులో చికిత్స అందించారు.

సాయంత్రం స్నాక్స్ బొరుగులు తిని వాటర్ తాగాం. తరువాత వాంతులు అయ్యాయి. నీరసంగా, కడుపు నొప్పి వచ్చింది. - గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థిని

రాత్రి కడుపులో తిప్పినట్లు అనిపించింది. తరువాత వాంతులు అయ్యాయి. - గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థిని

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.