కర్నూలు జిల్లా అలూరు నియోజకవర్గంలోని మహిళ సంఘాలకు కార్మిక శాఖ మంత్రి జయరాం వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం చెక్కును అందజేశారు. జిల్లాలో 44,423 పొదుపు సంఘాలకు రూ.82.60 కోట్లు మంజూరు అయ్యాయని మంత్రి తెలిపారు. పాదయాత్ర చేపట్టిన సమయంలో మహిళలు తీసుకున్న రుణాలను కట్టలేక ఇబ్బందులు పడిన విషయం తమ దృష్టికి వచ్చిందని... తాము అధికారంలోకి వస్తే తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని... ఆ హామీని నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌ది అని ఆయన అన్నారు.
వైఎస్సార్ సున్నావడ్డీ పథకాన్ని ప్రారంభించిన కార్మికశాఖ మంత్రి - YSSAR is the Minister of Labor who initiated the zero-interest scheme at aloor
రాష్ట్రంలో క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికి మహిళలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కార్మిక శాఖ మంత్రి గుమ్మునూరు జయరాం అన్నారు.
చెక్కను అందిస్తున్న కార్మిక శాఖ మంత్రి
కర్నూలు జిల్లా అలూరు నియోజకవర్గంలోని మహిళ సంఘాలకు కార్మిక శాఖ మంత్రి జయరాం వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం చెక్కును అందజేశారు. జిల్లాలో 44,423 పొదుపు సంఘాలకు రూ.82.60 కోట్లు మంజూరు అయ్యాయని మంత్రి తెలిపారు. పాదయాత్ర చేపట్టిన సమయంలో మహిళలు తీసుకున్న రుణాలను కట్టలేక ఇబ్బందులు పడిన విషయం తమ దృష్టికి వచ్చిందని... తాము అధికారంలోకి వస్తే తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని... ఆ హామీని నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌ది అని ఆయన అన్నారు.
ఇదీ చూడండి:ఇల్లు ముద్దు... నరకం వద్దు