ETV Bharat / state

దేవుడి భూమినీ వదలని వై'చీప్' నాయకులు - Soil mafia of YSRCP leaders

Soil Mafia in Kurnool: అక్రమార్కుల ధనదాహానికి ఆలయ భూములు కనుమరుగవుతున్నాయి. అక్రమంగా మట్టిని తవ్వి, తరలిస్తూ భారీగా దండుకుంటున్నారు. ప్రశ్నించినవారిని.. పోలీసు కేసుల పేరు చెప్పి నోరు మూయిస్తున్నారు. తుపాకీతో బెదిరించి చంపేస్తామంటూ భయపెడుతున్నారు. అధికారం అండతో వైఎస్సార్సీపీ నాయకులు చేస్తున్న ఆగడాలను భరించలేకపోతున్నామంటూ కర్నూలు జిల్లా ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Soil Mafia in Kurnool
మట్టి మీఫియా
author img

By

Published : Feb 5, 2023, 10:54 PM IST

కర్నూలులో మట్టి మాఫియా

Soil Mafia in Kurnool: కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం శకునాలలోని శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి, అర్చకుల జీవనోపాధి కోసం గ్రామ పెద్దలు.. దశాబ్దాల క్రితం 18 ఎకరాల భూమిని మాన్యంగా ఇచ్చారు. ఈ భూమి ద్వారా వచ్చే ఆదాయంతోనే.. అర్చకులు తరతరాలుగా ఆలయంలో దూపదీప నైవేద్య పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక.. స్థానిక నాయకుల కన్ను ఈ భూమిపై పడింది. రహదారులు, ఇళ్ల నిర్మాణాల కోసం మట్టి అవసరం ఉందంటూ.. ఆ భూమిలో తవ్వకాలు చేపట్టారు. ఇష్టారాజ్యంగా మట్టిని తవ్వుతూ కోట్లు గడిస్తున్నారు.

అక్రమ తవ్వకాలను అడ్డుకునేందుకు గ్రామ రైతులు, ప్రజలు అనేక ప్రయత్నాలు చేశారు. తహసీల్దారు, దేవదాయశాఖ అధికారులు, కలెక్టర్‌ను కలిసి ఎన్నోసార్లు వినతిపత్రాలు ఇచ్చారు. వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. తవ్వకాలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే.. పోలీసు కేసులు పెట్టిస్తామని బెదిరిస్తున్నట్లు రైతులు తెలిపారు. తుపాకీ చూపించి.. చంపేస్తామంటూ భయపెట్టినట్లు వాపోతున్నారు.

మట్టి తవ్వకాలతో దేవుడి మాన్యం భూమి వ్యవసాయానికి పనికి రాకుండా పోయింది. ఇకనైనా అధికారులు మట్టి తవ్వకాలను అడ్డుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. పాడైపోయిన భూమిలో అక్రమార్కులతోనే మట్టి పోయించి.. పునరుద్ధరింపజేయాలని డిమాండ్ చేస్తున్నారు.

"శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయ భూమిని పెద్దలు అప్పట్లో గ్రామం తరపున అర్చకులకు ఇచ్చారు. అలాంటి భూమిని వైఎస్సార్సీపీ వచ్చిన తరువాత రోడ్ల కోసం మొత్తం తవ్వేశారు. గ్రామం తరపున చాలా సార్లు అర్జీలు ఇచ్చాం". - చంద్రబాబు, శకునాల

"ఎకరా భూమి 20 లక్షల రూపాయలు చేస్తది. అటువంటి భూమిని ఇలా చేశారు. బెదిరిస్తున్నారు. మా శక్తి చాలక ఇలా మీడియాతో చెప్పుకుంటున్నాం". - ధర్మారెడ్డి, శకునాల

"ఈ ప్రభుత్వంలో ఉన్నట్టు ఎవరూ కూడా ఇంత అన్యాయంగా చేయలేదు. కొట్టడానికి కూడా వస్తున్నారు. దేవుడి భూములతో వాళ్లకు ఏం పని. పేదవారి నోర్లు కొట్టి బతుకున్నారు". - మల్లమ్మ, శకునాల

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.