Viral Video: 'మిమ్మల్ని గెలిపించి తప్పు చేశాం'.. వైకాపా కార్యకర్త వీడియో వైరల్ - ఏపీ వార్తలుట
Video Against Minister Jayaram: కర్నూలు జిల్లాకు చెందిన మంత్రి గుమ్మనూరు జయరాం ప్రజలకు చేసిందేమీ లేదని వైకాపా కార్యకర్త విడుదల చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆస్పరి మండలం కైరుప్పలకు చెందిన సుంకన్న అనే వైకాపా కార్యకర్త ఈ వీడియోను విడుదల చేశారు. గుమ్మనూరు జయరాంను గెలిపించి తప్పుచేశామని.. ఆలూరు నియోజకవర్గానికి ఆయన ఏమీ చేయలేదని వీడియోలో ఆరోపించారు.