యువకుడి వివాహం రద్దు కావటంతో మనస్థాపం చెంది శానిటైజర్ తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కర్నూలు జిల్లా బేతంచర్ల పట్టణంలో జరిగింది. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం మొహిద్దిన్పురం గ్రామానికి చెందిన వేల్పుల ఏడుకొండలు అనే యువకుడు గత కొన్ని రోజులుగా బేతంచర్లలోని పాలిష్ పరిశ్రమలో పనిచేస్తూ..జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి మహానంది మండలం నందిపల్లెకు చెందిన యువతితో వివాహం కుదిరింది. ఈ నెల 7న వివాహం జరగాల్సి ఉండగా...యువకుడు చెడు వ్యసనాలకు బానిస అని తెలిసి యువతి తల్లిదండ్రులు వివాహం రద్దు చేశారు. దీంతో మనస్థాపం చెందిన యువకుడు వివాహ వేడుకకు తెచ్చుకున్న శానిటైజర్ తాగి అస్వస్థతకు గురయ్యాడు. దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా అతను అప్పటికే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీచదవండి