పాము కాటుకు ఓ యువకుడి మృతి చెందాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా గూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో సంకేసుల గ్రామంలో జరిగింది. గ్రామంలో రమణారెడ్డి పెట్రోల్ పంపులో అర్ధరాత్రి బంకులో పనిచేసే బోయ విజయ్ అనే యువకుడు పాము కాటుకు గురై మృతి చెందాడు.
ఈ యువకుడు శివమాల ధరించి పెట్రోల్ బంకులో ఉన్న గదిలో నిద్రిస్తుండగా సంఘటన జరిగింది. విజయ్ తెలంగాణ రాష్ట్ర రాజోలు మండల తుమ్మిళ్ల గ్రామానికి చెందిన వాడిగా గుర్తించారు. ఎస్సై నాగార్జున కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: