కర్నూలు జిల్లా నంద్యాల ఎన్జీవో కాలనీలో ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణంలోని ఒకటవ పట్టణ పోలీసు స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న లక్ష్మీ నారాయణ కుమారుడు రవితేజ... ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
బీటెక్ పూర్తై రెండు సంవత్సరాలైనా ఉద్యోగం రాలేదన్న మనస్థాపంతో చాలా కాలం బాధ పడ్డాడని రవితేజ కుటుంబీకులు చెప్పారు. ఆ ఆవేదనతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: