కర్నూలు జిల్లా డోన్‌కు చెందిన గురుమోహన ఆచారి వృత్తి రీత్యా వడ్రంగి. రైతుల కష్టాలను దృష్టిలో ఉంచుకొని నెల రోజులు కష్టపడి కలుపు యంత్రాన్ని తయారు చేశాడు. కోయంబత్తూరులో కొన్ని పరికరాలు తెచ్చాడు. బేరింగ్లు, పుల్లీలు, బెల్టులు తెచ్చి బిగించాడు. ఇనుప చక్రాలు, గొర్రు, బాడి సొంతంగా తయారుచేసి వీటిపైన ఇంజిన్ కూర్చోబెట్టాడు. మొత్తం ఖర్చు 30 వేల రూపాయల నుంచి 35 వేల రూపాయలు అయ్యిందని ఆచారి తెలిపాడు. మామిడి, మిరప, పంటలలో కలుపు తీసేందుకు ఇది ఉపయోగపడుతుంది. 2 లీటర్ల డీజిల్‌తో ఒక ఎకరం పొలం దున్నొచ్చు.
అదే.. ఎకరం పొలం దున్నాలంటే ట్రాక్టర్‌కు 800 రూపాయలు, కలుపు తీయాలంటే కూలీలకు 1000 రూపాయలు అవుతుంది. ఈ యంత్రం వల్ల తక్కువ ఖర్చుతో కలుపు తీసుకోవచ్చు. రోడ్డుపైన వెళ్ళేటప్పుడు టైర్లతో, పొలంలో అయితే ఇనుప చక్రాలను బిగించవచ్చు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే రైతులకు ఉపయోగపడేలా... మరిన్ని తయారు చేస్తానని చెబుతున్నాడు గురు మోహన్ చారి.