ETV Bharat / state

తుంగభద్ర నదిలో యువకుడు గల్లంతు - kurnool district newsupdates

తుంగభద్ర నదిలో స్నానానికి దిగి ఓ యువకుడు గల్లంతయ్యాడు. అతడి కోసం నదిలో గాలించిన ఆచూకీ దొరకలేదు. ఈ ఘటన కర్నూలు జిల్లా కౌతాళం మండలంలో జరిగింది.

A young man drowns in the Tungabhadra river
తుంగభద్ర నదిలో యువకుడు గల్లంతు
author img

By

Published : Feb 26, 2021, 12:34 PM IST

కర్నూలు జిల్లా కౌతాళం మండలం మేళికనూరు గ్రామం వద్ద తుంగభద్ర నదిలో స్నానమాచరించేందుకు వెళ్లిన ఓ యువకుడు గల్లంతయ్యాడు. స్థానికులు నదిలో వెతికినా ఆచూకీ లభించలేదు. మేళిగనూరు గ్రామానికి చెందిన నర్సప్ప, లక్ష్మి దంపతులకు ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. వీరి తృతీయ కుమారుడు రాము గొర్రెలను మేపేందుకు వెళ్తుంటాడు. హాల్విలో పనులు పూర్తిచేసుకుని తిరిగి వచ్చే క్రమంలో తోటి గొర్రెల కాపరి వెంకటేష్​తో కలిసి నదిలో స్నానానికి వెళ్లారు. నీటిలో మునిగిన రాము పైకి రాకపోవటంతో తోటి కాపరి వెంకటేష్ స్థానికులకు తెలిపారు. వెంటనే సీడబ్ల్యూసీ సిబ్బంది.. బోటు వేసుకుని నదిలోకి వెళ్లారు. నదిలో గాలించిన ఆచూకీ దొరకలేదు. కుటుంబీకులు తెలుసుకుని కన్నీరుమున్నీరయ్యారు.

ఇదీ చూడండి: గోదావరి-కావేరి అనుసంధానం.. ఇచ్చంపల్లి నుంచే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.