ETV Bharat / state

బాల్యం నుంచే ఆసనాలు... సాధించింది ఎన్నో పతకాలు

ఎంతటి కష్టమైన యోగాసనాలనైనా అలవోకగా వేసేస్తుంది ఆ యువతి. చిన్నతనం నుంచి ఈ రంగంలో రాణిస్తూ అందరి మన్ననలు పొందుతోంది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ చూపి 20కి పైగా పతకాలను సాధించింది.

author img

By

Published : May 10, 2019, 8:03 AM IST

యోగా చేస్తున్న లలన
యోగాలో మేటి.. లేరు ఎవరు పోటీ

కర్నూలుకు చెందిన లలనప్రియ యోగా పోటీల్లో సత్తా చాటుతోంది. తన ఆసనాలతో అందరిని అబ్బురపరుస్తూ పతకాలను సొంతం చేసుకుంటోంది. వ్యాయామ ఉపాధ్యాయుడి ప్రోత్సాహంతో మూడో తరగతి చదువుతున్నప్పుడే యోగా రంగంలో ఓనమాలు దిద్ది ఇప్పటి వరకు పలు పోటీల్లో 20కి పైగా పతకాలను సొంతం చేసుకుంది.

కర్నూలు నగరంలోని కల్లూరు ఎస్టేట్ ప్రాంతానికి చెందిన రామకృష్ణ, మాధురి మొదటి సంతానమే లలనప్రియ. చిన్నప్పుడు చదువులో వెనుకబడినా యోగాపై ఆసక్తి కనబరిచేది. ఈమె ప్రతిభను గుర్తించిన ఉపాధ్యాయుడు... జిల్లా స్థాయి యోగా పోటీలకు తీసుకువెళ్లేవారు. ఈ పోటీల్లో పతకాలు సాధించి...రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అక్కడా... మొదటి, ద్వితీయ బహుమతులు సొంతం చేసుకున్నారు.

ఇప్పటి వరకు రాష్ట్రస్థాయిలో 20... జాతీయ స్థాయిలో 2 పతకాలు సొంతం చేసుకున్నారు. అంతర్జాతీయ స్థాయి పోటీలకు వెళ్లి... తన సత్తా చాటాలని భావిస్తున్నారు లలన ప్రియ. యోగాలో పతకాలు సాధించడమే కాకుండా విద్యలోనూ రాణిస్తోంది ఈ యువతి. యోగా సాధనతో చదువుపై ఏకాగ్రత పెరిగి మంచి మార్కులు సాధిస్తోంది. ప్రస్తుతం ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న లలన... పదో తరగతిలో 9.5.... ఇంటర్ మొదటి సంవత్సరంలో 9 పాయింట్లతో సత్తా చాటింది.

యోగా దినోత్సవం రోజు... కర్నూలులో ఈమె ఆసనాలనే నగరవాసులందరూ అనుసరిస్తారు అంటే అతిశయోక్తి కాదు. భవిష్యత్తులో పోలీసు అధికారి కావడమే తన లక్ష్యమంటోంది లలన. చిన్నారుల ప్రతిభను గుర్తించి... వారిని ప్రోత్సహిస్తే... అద్భుత విజయాలు సాధించవచ్చని నిరూపిస్తోంది లలన ప్రియ.

Intro:AP_RJY_88_08_endala_prabhavam_AV_C15

etv bharat :Satyanarayana( RJY CITY )

( ) తూర్పు గోదావరి జిల్లా లో ఎండల తీవ్రత మరింత పెరిగింది. ఉదయం నుండి 10 దాటిన తర్వాత జనం బయటకు రావాలంటే భయపడుతున్నారు. రాజమహేంద్రవరం, రాజానగరం తదితర ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. రహదారులు నిర్మానుష్యంగా మారాయి. అత్యవసర పనులుంటే తలకు ముఖానికి రక్షణగా ధరించి ప్రయాణం చేస్తున్నారు.

Body:AP_RJY_88_08_endala_prabhavam_AV_C15

Conclusion:AP_RJY_88_08_endala_prabhavam_AV_C15
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.