కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నేత, వైకాపా నాయకుడు, ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి(72) కరోనాతో మృతి చెందారు. అవుకు మండలం ఉప్పలపాడుకు చెందిన చల్లా.. గత కొంతకాలంగా కొవిడ్‌తో బాధపడుతూ.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మరణించారు. 1948 ఆగస్టు 27న జన్మించిన చల్లా.. 1983లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయరంగ ప్రవేశం చేశారు. 1983లో పాణ్యం నుంచి, 1999, 2004 ఎన్నికల్లో కోయిలకుంట్ల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో.. పౌరసరఫరాల కార్పొరేషన్ ఛైర్మెన్‌గా పనిచేశారు. ఎన్నికలకు ముందు ఆయన వైకాపాలో చేరారు. గతంలో కాంగ్రెస్ లోనూ పనిచేశారు.
సీఎం సంతాపం..
వైకాపా నేత , ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా రాజకీయాల్లో చల్లా కీలక పాత్ర పోషించారన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఇదీ చదవండి: దేశంలో కొత్తగా 20,036 కేసులు, 256 మరణాలు