ఇసుక అందుబాటులోకి రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని కర్నూలు జిల్లా మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తెలిపారు. మంత్రాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో కలెక్టర్ వీరపాండ్యన్తో కలిసి ఆయన పాల్గొన్నారు. కూలీలకు పని దొరకటం లేదని... ఇళ్లు కట్టుకునేవారికి ఇసుక అందుబాటులో లేదని గుర్తు చేశారు. ఎవరైనా అవసరం ఉందని ఓ ట్రాక్టర్ ఇసుక తెచ్చుకుంటే పోలీసులు కేసులుపెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
ఇదీ చూడండి: " ఇసుక కొరత విశ్లేషణలో మీ పార్టీ విఫలం"