YCP Councilor Angry On YCP Government:ప్రజల నుంచి వివిధ రకాల పన్నులు వసూలు చేస్తున్న ప్రభుత్వం కనీసం వీధి దీపాలు వేయలేని స్థితిలో ఉందని వైసీపీ కౌన్సిలర్ ఖాసీం బేగ్ అసహనం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అభివృద్ధి పనులపై అడిగితే డబ్బులు లేవంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పింఛన్లు తొలగించడంపై టీడీపీ కౌన్సిలర్లు కార్యాలయ ద్వారం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.
ఇవీ చదవండి