ETV Bharat / state

కర్నూలులో క్లీన్​స్వీప్... తెదేపాకు తప్పని భంగపాటు

కర్నూలు జిల్లాలో వైకాపా విజయ సునామీ స్పష్టించింది. అన్ని స్థానాలనూ తన ఖాతాలో వేసుకుని విజయ దుందుభి మోగించింది.

కొండారెడ్డి బురుజు
author img

By

Published : May 24, 2019, 6:02 AM IST

కర్నూలు జిల్లాలోని మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు, 2లోక్​సభ స్థానాలను వైకాపా తన జేబులో వేసుకుంది. తెదేపా ముఖ్య నేతలను వెనక్కు తోసి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఆళ్లగడ్డ నియోజకవర్గంలో విజయం సాధించింది. తెదేపా అభ్యర్థి,మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పోటీ చేసిన ఈ నియోజకవర్గంలో వైకాపా నేత బిజేంద్రనాథ్ రెడ్డి గెలుపొందారు. టీజీ వెంకటేశ్ తనయుడు టీజీ భరత్ బరిలో దిగిన కర్నూలు అసెంబ్లీ స్థానాన్ని హఫీజ్ ​ఖాన్ కైవసం చేసుకున్నారు.

రాజకీయ కుటుంబాలకు పరాభవం..
కోట్ల, కేఈ కుటుంబాలకు ఈ ఎన్నికల్లో పెద్ద దెబ్బే తగిలింది. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కర్నూలు ఎంపీగా, ఆయన భార్య కోట్ల సుజాతమ్మ ఆలూరు ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేయగా ఇద్దరూ ఓడిపోయారు. ఆస్థానాల్లో డాక్టర్ సంజీవ్ కుమార్, పి.జయరాం గెలుపొందారు. ఇక కేఈ కుటుంబంలోనూ ఇద్దరు పరాభవం పొందారు. పత్తికొండ అసెంబ్లీ స్థానానికి ఆయన కుమారుడు కేఈ శ్యామ్​బాబు, డోన్ నియోజకవర్గానికి ఆయన సోదరుడు కేఈ ప్రతాప్ పోటీ చేయగా ఇద్దరూ ఓడిపోయారు. ఆయా నియోజకవర్గాల్లో కె. శ్రీదేవి, బుగ్గన రాజేంద్రనాథ్ గెలుపొందారు. మరో ముఖ్య నియోజకవర్గమైన నంద్యాల అసెంబ్లీ స్థానంలో శిల్పా రవి చంద్రారెడ్డి జెండా పాతారు. తెదేపా అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఓటమి చవిచూశారు. నంద్యాల పార్లమెంట్ స్థానాన్ని కూడా వైకాపానే సాధించింది. తెదేపా నేత శివానందరెడ్డిపై పోచ బ్రహ్మానందరెడ్డిపై చేయి సాధించారు.

తెదేపా నేతలకు చేదు అనుభవం..
కర్నూలు జిల్లాలో హేమాహేమీలతో పాటు చిన్న నేతుల సైతం గెలుపుదిశగా అడుగులు వేయలేదు. మంత్రాలయం వైకాపా అభ్యర్థి వై. బాలనాగిరెడ్డి చేతిలో తిక్కారెడ్డి ఓటమి పాలయ్యారు. కోడుమూరులోనూ వైకాపా జెండా ఎగిరింది. రామాంజనేయులపై సుధాకర్ బాబు గెలుపొందారు. ఆదోనిలో తెదేపా నేత మీనాక్షి నాయుడుపై వై. సాయిప్రసాద్ రెడ్డి విజయం సాధించారు. ఎమ్మిగనూరులో బీవీ జయనాగేశ్వర రెడ్డిపై కె. చెన్నకేశవరెడ్డి సత్తా చాటారు. బనగానపల్లెలో కాటసాని రామిరెడ్డి విజయకేతనం ఎగురవేశారు. ఈ స్థానంలో తెదేపా నుంచి బీసీ జనార్థన్ రెడ్డి పరాభవం పొందారు. శ్రీశైలం నుంచి శిల్పా చక్రపాణి రెడ్డి గెలుపొందారు. బుడ్డా రాజశేఖర్ రెడ్డికి చేదు అనుభవం మిగిలింది. నందికొట్కూరులో తెదేపా అభ్యర్థి బండి జయరాజుపై ఆర్థర్ గెలుపొందారు. ఇక మరో ముఖ్య నియోజకవర్గమైన పాణ్యంలోనూ వైకాపా జెండానే ఎగిరింది. గౌరు చరితా రెడ్డి గెలుస్తారనే అంచనాలు వచ్చినప్పటికీ కాటసాని రాంభూపాల్ రెడ్డి విజయం సాధించారు.

ఇదీ చదవండీ:మెచ్చారు జనం... వచ్చారు జగన్

Chandigarh, May 23 (ANI): Punjab Chief Minister Captain Amarinder Singh on Thursday sharply criticised his cabinet colleague Navjot Singh Sidhu by asserting that Indians, especially servicemen, will not tolerate hugging the Pakistani Army Chief.While replying to a question about Sidhu's alleged pro-Pakistan stand affecting the Congress performance in Lok Sabha polls, Singh said, "I have said since day one, Indians, especially servicemen, will not tolerate hugging the Pakistan's Army Chief. Every day there is some ceasefire violation, our soldiers lose their lives. It is Pakistan's General who gives the order for these things and you cannot go and hug him".

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.