ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన సంపూర్ణ మద్యపాన నిషేధం హమీని నిలబెట్టుకోవాలని కర్నూలులో మహిళా సంఘాలు ధర్నా చేశాయి. ఎన్నికల్లో గెలిచాక ఇచ్చిన హమీలను వదిలేసి మద్యం షాపులు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. షాపింగ్ కాంప్లెక్స్ లలో కుడా మద్యం ఏర్పాటు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో మహిళలపై జరిగే దాడులకు మద్యమే కారణమని.. అలాంటి మద్యాన్ని రాష్ట్రంలో వెంటనే నిషేధించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చదవండి: పెట్రోల్ బంకులో మోసం.. వినియోగదారుల ఆందోళన