కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలం సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఈనెల 22వ తేదీన లభ్యమైన మహిళ మృతదేహం వెనుక మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆమెను భర్తే హత్య చేసినట్లు నిర్ధరించారు.
ఆళ్లగడ్డ డీఎస్పీ పోతురాజు చెప్పిన వివరాల ప్రకారం.. రుద్రవరం మండలం ఆలుమూరుకు చెందిన సుబ్బలక్ష్మమ్మ, చంద్రశేఖర్ భార్యాభర్తలు. గత కొంతకాలంగా ఆమె ప్రవర్తనపై భర్త చంద్రశేఖర్ అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఆమెను చంపాలని నిర్ణయించుకుని పథకం రచించాడు. ఈనెల 22న సుబ్బలక్ష్మమ్మను అహోబిళం తీసుకెళ్లి అక్కడి అటవీ ప్రాంతంలో బండరాయితో ఆమె తలపై మోది హతమార్చాడు. మృతదేహం దగ్గర దొరికిన ఫోన్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేసి వివరాలు రాబట్టారు. నిందితుడు చంద్రశేఖర్ వీఆర్వో సమక్షంలో లొంగిపోయాడు. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు.
ఇవీ చదవండి...