మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని భాజపా ఎంపీ టీజీ వెంకటేశ్ అన్నారు. కర్నూలు జిల్లాలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం మాత్రమే ఏర్పాటు చేసి అన్యాయం చేస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో హైకోర్టుతో పాటు మినీ అసెంబ్లీ, మినీ సెక్రటేరియట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా విశాఖ, అమరావతిలోనూ హైకోర్టు బెంచ్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. వీటితోపాటు విశాఖను కార్యనిర్వాహక రాజధానిని చేస్తే ఆ జిల్లాలోనూ మినీ అసెంబ్లీ, మినీ సెక్రటేరియట్ నెలకొల్పాలని ప్రభుత్వాన్ని కోరారు. అమరావతి, కర్నూలులోనూ ప్రాంతీయ కార్యనిర్వాహక కార్యాలయాలను ఏర్పాటు చేయాలని టీజీ వెంకటేశ్ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి