ETV Bharat / state

సమస్యలకు పరిష్కారం చూపుతున్నాం:ఎమ్మెల్యే డా.సుధాకర్ - kurnool district newsupdates

కర్నూలు పట్టణంలో బస్టాండ్​ను పునరుద్ధరించేందుకు కోడుమూరు ఎమ్మెల్యే డా.సుధాకర్ భూమిపూజ చేశారు. ఏళ్ల నాటి సమస్యలకు తమ ప్రభుత్వ హయాంలోనే పరిష్కారం చూపుతున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

We are solving problems
సమస్యలకు పరిష్కారం చూపుతున్నాం:ఎమ్మెల్యే డా.సుధాకర్
author img

By

Published : Mar 22, 2021, 12:16 PM IST

ఏళ్ల నాటి సమస్యలకు తమ ప్రభుత్వ హయాంలోనే పరిష్కారం చూపుతున్నామని కోడుమూరు ఎమ్మెల్యే డా.సుధాకర్ పేర్కొన్నారు. పట్టణంలో బస్టాండ్​ను పునరుద్ధరించేందుకు ఎమ్మెల్యే భూమిపూజ నిర్వహించారు. గూడూరులో డంపుయార్డు, పట్టణంలో రోడ్ల విస్తరణ, తాగునీటి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రూ. 23.86 లక్షల నిధులు మరమ్మతులకు వచ్చేలా చూశామన్నారు. కార్యక్రమంలో నగరపంచాయతీ అధ్యక్షుడు జులపాల వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు పీఎస్ అస్లాం, కర్నూలు ఆర్టీసీ డీఎం భాస్కర్, డీఈ వెంకటేశ్వర్లు, గుత్తేదారు ముక్తారు బాషా, పీఎస్సై మమత హాజరయ్యారు.

ఇదీ చదవండి: అమ్మాయిలకు ఆ పాత చింతపండు కథలు.. ఇక చెప్పకండి..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.