శ్రీశైలం జలాశయం డెడ్ స్టోరేజ్ 790 అడుగులు. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 33.10 టీఎంసీలకు తగ్గిపోయింది. ఏప్రిల్ నెలలోనే ఈ పరిస్థితి నెలకొనటంతో వచ్చే రెండు నెలల్లో నీటిమట్టం మరింతగా పడిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. వన్యప్రాణులు, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని శ్రీశైలంలో కచ్చితంగా 30 టీఎంసీల నిల్వ ఉంచాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆదేశం. 2015- 16, 2016-17 మే నెలలో 18 టీఎంసీలకు నీటి నిల్వ పడిపోయింది. గతేడాది 20 టీఎంసీలకు తగ్గింది.
ఇదీ చదవండి: తిరుపతిలో దొంగ ఓట్ల కలకలం.. తెదేపా ఆందోళన