శ్రీశైలం జలాశయానికి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఇప్పటికే జలాశయానికి 2,13,486 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. శ్రీశైలం జలాశయంలో ప్రస్తుత నీటిమట్టం 855.30 అడుగులు ఉంది. నీటి నిల్వ 92.7050 టీఎంసీలుగా ఉంది. ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేసి.. 38,140 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
ఇదీ చదవండి: తెల్లవారక ముందే వారి బతుకులు తెల్లారిపోయాయి