శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం ఇన్‌ఫ్లో 1,22,057, ఔట్‌ఫ్లో 56,600 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటిమట్టం 869.9 అడుగులు కాగా... జలాశయ గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులుగా ఉంది. ప్రస్తుత నీటినిల్వ 141.32 టీఎంసీలుగా ఉంది. మరో వారంలో శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి