కర్నూలు జిల్లా డోన్ మండలం కొచ్చెర్వులో విషాదం చోటుచేసుకుంది. ఈత నేర్చుకోవటానికి వెళ్లి వార్డు వాలంటీర్ పవన్ మృతి చెందాడు. తన స్నేహితులతో కలసి ఈత నేర్చుకునేందుకు సుద్ద గని వద్దకు వెళ్లిన పవన్... నీటి లోతును అంచనా వేయలేక.. ఈత రాక మునిగిపోయాడు. స్నేహితులు బయటకు తీసేలోపు ప్రాణాలు విడిచాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి:
ARREST: 330 కేసుల్లో జైలుపాలైనా బుద్ధి రాలేదు.. మళ్లీ అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్!