ETV Bharat / state

లంచం అడిగాడు..సెల్​ఫోన్​కి చిక్కాడు.. - కర్నూలు

పట్టపగలు ప్రభుత్వ కార్యాలయంలో లంచం తీసుకోవటం, వినటం కొత్త కాదు. కానీ అడిగే విధానం మాత్రం చాలా దర్జగా, చేసే పని మంచి పని అన్నట్టు వచ్చిన వారిని డిమాండ్ చేయటం గమనార్హం. అంతేనా మీరిచ్చే లంచం మాకోసం మాత్రమే కాదు.. పై అధికారుల ఖర్చులకంటూ చెప్పటం విశేషం. ఈ ఘటన కర్నూలు జిల్లాలో జరగ్గా సెల్​ఫోన్​లో బాధితుడే చిత్రీకరించాడు.

లంచం తీసుకుంటూ.. సెల్​ఫోన్​కి బందీ అయిన వీఆర్వో
author img

By

Published : Sep 30, 2019, 8:17 AM IST

లంచం తీసుకుంటూ.. సెల్​ఫోన్​కి బందీ అయిన వీఆర్వో
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం కోట కందుకూరు వీఆర్వో శివారెడ్డి చుక్కల భూమి పరిష్కరించేందుకు డబ్బులు డిమాండ్ చేస్తూ కెమెరా వలలో చిక్కాడు. ఆర్.కృష్ణాపురం గ్రామానికి చెందిన రామ సుబ్బారెడ్డి తన సర్వే నెంబర్​లోని నాలుగున్నర ఎకరాలు చుక్కల భూమి జాబితా నుంచి విముక్తి పొందేందుకు విఆర్వోను ఆశ్రయించాడు. గత ఐదు నెలలుగా అతడి చుట్టూ తిరుగుతున్నా డబ్బులు ఇవ్వనిదే పనిచేయని తెగేసి చెప్పాడు. ఎలాగైనా అతని ఆటలు కట్టిపెట్టాలని బాధితుడు మూడు రోజుల క్రితం ఆళ్లగడ్డ తాహసీల్దార్ కార్యాలయం చేరుకుని తన సెల్​ఫోన్​ను ఆన్​లో ఉంచుకొని వీఆర్వోతో మంతనాలు చేశాడు. డబ్బులు ఇవ్వాలని శివారెడ్డి చేసిన డిమాండ్​ను రికార్డు చేశాడు. చుక్కల భూమిని పరిష్కరించాలంటే పై అధికారులు కూడా డబ్బులు ఇవ్వాల్సి వస్తోందని, డబ్బులు లేనిదే పని కాదని వీఆర్వో చెప్పారు. పైగా తమకు ఉన్నతాధికారులు వచ్చిన సమయంలో వారికి ఖర్చు పెట్టాల్సి ఉంటోందని వాటన్నించి ఎవరు భరిస్తారంటూ ఎదురు ప్రశ్న వేశారు. ఈ తతంగం అంతా పట్టపగలు తహసీల్దార్ కార్యాలయంలో జరగటం గమనార్హం. ఇప్పటికైనా మాలాంటి అమాయక ప్రజలకు జరిగే అన్యాయాన్ని ప్రభుత్వం పట్టించుకోవాలని బాధితులు కోరుకుంటున్నారు.

ఇదీ చూడండి:

బ్యాంకు నిధులు పక్కదారి... ముగ్గురు సిబ్బంది అరెస్టు

Intro:ap_atp_61_29_yuoth_with_bear_av_ap10005
____:_______*
ఎలుగును తరిమిన యువకులు..
-------------*
తమ గ్రామంలో ఎలుగుబంటి ప్రవేశించి దాడి చేస్తుందని పసిగట్టిన యువకులు మూకుమ్మడిగా ఏకమై ఆ ఎలుగును తరిమికొట్టారు. తాజాగా శనివారం సాయంకాలం అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం రాయలప్పదొడ్డి గ్రామంలో ఎలుగు ప్రవేశించి ఓ వ్యక్తిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తోందని గమనించిన యువకులు ఆ ఎలుగును వెంబడించి కొండ ప్రాంతాల్లో కి తరిమారు. ఈ తతంగాన్ని ఓ యువకుడు మోటార్ సైకిల్ పై వెళుతూ తన సెల్ ఫోన్లో చిత్రీకరించిన దృశ్యాలు స్థానిక గ్రూపుల్లో హల్చల్ చేస్తున్నాయి. రాయలప్పదొడ్డి గ్రామం అటవీ ప్రాంతానికి సమీపంలో ఉంది. గ్రామం పరిసరాల్లో తరచూ ఎలుగుబంట్లు సంచరిస్తుంటాయి. ఇప్పటికే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. యువకులు చిత్రీకరించిన దృశ్యాల్లో గ్రామ ప్రాంతంలో నుంచి కొండ ప్రాంత వరకు పలు పొలాలు, రోడ్ల వెంట గొర్రెల మందలను దాటుకుంటూ ఎలుగుబంటి పరిగెడుతూ కిలోమీటర్ల కొద్దీ ఆద్యంతం అం చిత్రీకరించడం ఈ ప్రాంతంలో చర్చనీయాంశమైంది. ఈ విషయాన్ని కళ్యాణదుర్గం పట్టణ శాఖ అధికారులు ధృవీకరించారు.Body:రామక్రిష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.