ETV Bharat / state

రారావి నదిలో పడ్డ వ్యక్తి..రక్షించిన గ్రామస్థులు - బళ్లారి వద్ద రారావి నదిలో కొట్టుకుపోయిన వ్యక్తి-రక్షించిన సిరుగుప్ప గ్రామస్థులు

కర్ణాటకలోని బళ్లారి వద్ద రారావి (వేదవతి)నదిలో మన రాష్ట్రానికి చెందిన దేవేంద్ర అనే వ్యక్తి ప్రమాదవశాత్తు జారి పడిపోయాడు. ప్రవాహంలో కొట్టుకుపోతున్న అతన్ని సిరుగుప్ప గ్రామస్థులు కాపాడి ఒడ్డుకు చేర్చారు.

Villagers Rescued Andhra man, who washed away in Raaravi River near ballari
బళ్లారి వద్ద రారావి నదిలో కొట్టుకుపోయిన వ్యక్తి-రక్షించిన సిరుగుప్ప గ్రామస్థులు
author img

By

Published : Sep 14, 2020, 4:16 PM IST

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన దేవేంద్ర కూమార్తె అనారోగ్యానికి గురి కావడం వల్ల చూసేందుకు కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా సిరుగుప్ప నగర్​కు వెళ్లాడు. కుమార్తెను పరామర్శించి ఆదివారం మధ్యాహ్నం భార్య హనుమంతమ్మతో కలిసి ద్విచక్ర వాహనంపై సొంతూరుకు బయలుదేరాడు. బళ్లారిలో రారావి నది వద్దకు రాగానే బైక్ అదుపుతప్పి.. ప్రమాదవశాత్తు నదిలో జారి పడిపోయాడు. ప్రవాహంలో కొట్టుకుపోతున్న దేవేంద్రకు చెట్టు కాండం తగిలింది. కొట్టుకుపోకుండా దాన్ని గట్టిగా పట్టుకుని రక్షించండి అంటూ కేకలు వేశాడు. అటుగా వెళ్తున్న సిరుగుప్ప గ్రామస్థులు అతన్ని గమనించి రక్షించారు.

ఇవీ చదవండి: భారీ వర్షాలకు ఉప్పొంగుతున్న కుందూ, పెన్నా

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.