ETV Bharat / offbeat

సండే స్పెషల్​: ఆంధ్రా స్టైల్​ "మునక్కాడ చికెన్ కర్రీ" - ఇలా వండితే రుచి అద్భుతం! - MULAKKADA CHICKEN CURRY

-సండే రోజు ఏం వండాలా అని ఆలోచిస్తున్నారా ? -ఇలా మునక్కాడ చికెన్ కూర వండండి!

Andhra Style Mulakkada Chicken Curry
Andhra Style Mulakkada Chicken Curry (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 25, 2025, 4:16 PM IST

Andhra Style Mulakkada Chicken Curry : నాన్​వెజ్​తో రకరకాల రెసిపీ ట్రై చేయాలంటే అది చికెన్​తోనే సాధ్యం! చికెన్​తో ఎన్ని కూరలు వండినా మరో కొత్త కర్రీ తప్పకుండా ఉంటుంది. అయితే, ఈ సండే రోజు ఎప్పుడు ఇంట్లో చికెన్​ వండినట్లు కాకుండా ఓ సారి ఆంధ్ర స్టైల్లో మునక్కాడ చికెన్ కర్రీ ట్రై చేయండి. ఈ స్టోరీలో చెప్పిన విధంగా చికెన్​ కర్రీ వండితే టేస్ట్​ అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ఈ క్రరీ ట్రై చేస్తే తప్పకుండా మళ్లీ మళ్లీ చేసుకుని తింటారు. మరి సింపుల్​గా మునక్కాడ చికెన్​ కర్రీ ఎలా చేయాలో ఓ లుక్కేయండి.

కావాల్సిన పదార్థాలు :

  • చికెన్ - అరకిలో (మీడియం సైజ్​లో కట్ చేసిన ముక్కలు)
  • నూనె - 4 టేబుల్​స్పూన్లు
  • ఉల్లిపాయలు - 2
  • టమాటాలు - 2
  • అల్లం వెల్లుల్లి పేస్ట్​- టేబుల్​స్పూన్​
  • కారం - రుచికి తగినంత
  • పసుపు - పావు టీస్పూన్​
  • ఉప్పు - రుచికి సరిపడా
  • గరం మసాలా - 1 టీస్పూన్
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • మునక్కాడలు - 3
  • నిమ్మరసం - కొద్దిగా

మసాలా పేస్ట్​ కోసం :

  • ధనియాలు - 2 టేబుల్​స్పూన్లు
  • జీలకర్ర - టేబుల్​స్పూన్
  • దాల్చినచెక్క - చిన్నది
  • యాలకలు - 4
  • లవంగాలు - 8
  • పచ్చి లేదా ఎండుకొబ్బరి ముక్కలు - పావు కప్పు
  • గసగసాలు - టేబుల్​స్పూన్

తయారీ విధానం :

  • ముందుగా చికెన్​ను శుభ్రంగా కడిగి ఒక​ గిన్నెలోకి తీసుకోండి. చికెన్ కర్రీలోకి కావాల్సిన టమాటా, ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకోండి.
  • అలాగే మునక్కాడలు పొట్టు తీసేసి ముక్కలుగా కట్​ చేసుకోండి.
  • అనంతరం స్టవ్​ పై పాన్​ పెట్టి ధనియాలు, జీలకర్ర, దాల్చినచెక్క, యాలకలు, లవంగాలు, పచ్చి లేదా ఎండుకొబ్బరి ముక్కలు ఒక్కోటి వేస్తూ కాసేపు వేపుకోండి. మసాలాలను సన్నని సెగ మీద వేపుకున్న తర్వాత ఇందులో గసగసాలు వేసి ఫ్రై చేసుకోండి.
  • తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసి కొన్ని నీళ్లు పోసి మెత్తగా పేస్టు చేసుకోండి.
  • ఇప్పుడు స్టౌపై పాన్​ పెట్టి నూనె పోసి వేడి చేయండి.
  • వేడివేడి నూనెలో ఉల్లిపాయ తరుగు, కరివేపాకులు, రుచికి సరిపడా వేసి ఫ్రై చేయండి.
  • ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే అల్లం వెల్లుల్లి పేస్ట్​ వేసి ఫ్రై చేయండి. తర్వాత పసుపు, కారం వేసి వేయించుకోవాలి. అనంతరం టమాట ముక్కలు వేసి మగ్గించాలి.
  • ఇందులో కొన్ని నీళ్లు పోసి టమాటలు మెత్తగా మగ్గి నూనె పైకి తేలె వరకు ఉడికించుకోవాలి.
  • తర్వాత చికెన్ ముక్కలు వేసి 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మునక్కాడ ముక్కలు, గ్రైండ్​ చేసిన మసాలా పేస్ట్, 2 కప్పుల నీళ్లు పోసి మూత పెట్టి చికెన్ ఉడికించుకోవాలి.
  • చికెన్, మునక్కాడ ముక్కలు బాగా ఉడికి కర్రీలో ఆయిల్ పైకి తేలిన తర్వాత గరం మసాలా, కాస్త కొత్తిమీర తరుగు, నిమ్మరసం వేసి మిక్స్ చేయండి.
  • ఒక రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్​ చేసి సర్వ్ చేసుకోండి.
  • అంతే ఇలా సింపుల్​గా చేసుకుంటే ఎంతో రుచికరమైన మునక్కాడ చికెన్ కర్రీ మీ ముందుంటుంది. ఈ కర్రీ వేడివేడి బగారా రైస్​లోకి చాలా బాగుంటుంది! నచ్చితే ఇలా చికెన్​ కర్రీ ఓ సారి ట్రై చేయండి.

అద్దిరిపోయే "రొయ్యల పులావ్" - ఇలా చేస్తే ఇంట్లో వాళ్లకి పండగే!

నాటు కోడి పులుసు ఇలా చేయండి - ఆ రుచిని జన్మలో మర్చిపోలేరు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.