కర్నూలు జిల్లా నంద్యాల గాందీచౌక్లో కూరగాయల విక్రేతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గాందీచౌక్లో ఉన్న మార్కెట్ ఆధునీకరణ చేస్తున్నందున అక్కడి వారిని నూనెపల్లి వ్యవసాయ మార్కెట్కు తరలించారు. అయితే గంపల్లో కూరగాయలు విక్రయించే వారు మాత్రం అక్కడే డివైడర్లపై అమ్మకాలు చేస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తప్పని పరిస్థతుల్లో ఇక్కడే కొనుగోళ్లు జరుపుతున్నామని వ్యాపారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: