ETV Bharat / state

Untimely Rains: రెక్కల కష్టం వర్షార్పణం.. ప్రభుత్వమే ఆదుకోవాలంటున్న మిర్చి రైతులు - అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

FARMERS AFFECTED BY UNTIMELY RAINS: రాష్ట్రంలో బుధవారం కురిసిన అకాల వర్షాలు అన్నదాతల ఆశల్నిముంచేశాయి. కర్నూలు, నంద్యాల జిల్లాలో పంట చేతికొచ్చిందని అప్పులు తీరతాయని భావించిన మిరప రైతుల తలరాత తెల్లారేసరికే మారిపోయింది. కల్లాల్లో ఎండబెట్టిన పంట నీటిలో తేలియాడటంతో రైతులు...నిండా నష్టపోయారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Apr 27, 2023, 9:09 AM IST

రెక్కల కష్టం వర్షార్పణం..ప్రభుత్వమే ఆదుకోవాలంటున్న మిర్చి రైతులు

FARMERS AFFECTED BY UNTIMELY RAINS : రాష్ట్రంలో బుధవారం కురిసిన అకాల వర్షాలు అన్నదాతల ఆశల్నిముంచేశాయి. కర్నూలు, నంద్యాల జిల్లాలో పంట చేతికొచ్చిందని అప్పులు తీరతాయని భావించిన మిరప రైతుల తలరాత తెల్లారేసరికే మారిపోయింది. కల్లాల్లో ఎండబెట్టిన పంట నీటిలో తేలియాడటంతో రైతులు నిండా నష్టపోయారు.

135 మి.మీ. వర్షపాతం : అకాల వర్షాలు రైతులను నట్టేట ముంచాయి. మిరప రైతుల ఆశలను అడియాశలు చేశాయి. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో బుధవారం తెల్లవారుజాము నుంచి కుండపోతగా కురిసిన వానలతో మిరప, ఇతర ఉద్యాన పంటలకు తీరని నష్టం వాటిల్లింది. రాష్ట్రంలోనే అత్యధికంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో 135 మి.మీ. వర్షపాతం నమోదైంది. గంటల వ్యవధిలో కురిసిన వానలతో పొలాలు వాగులను తలపించాయి.

చెదిరిపోయిన రైతుల కల : అనంతపురం, వైఎస్ఆర్, పల్నాడు, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోనూ వర్షాలు కురిశాయి. బుధవారం రోజంతా రాయలసీమ వ్యాప్తంగా వర్షాల ప్రభావం కొనసాగుతూనే ఉంది. ఒకటి రెండు రోజుల్లో మిరప అమ్మితే చేతికి సొమ్ము వస్తుందని, అప్పులు తీరతాయని ఆశించిన రైతుల కల ఒక్క రాత్రిలో చెరిగిపోయింది.

" రెండు ఎకరాలు మిరప పంట వేశాము. అకాల వర్షం రావటం వల్ల 150 మంది కోసిన పంట పోగోట్టుకున్నాము. రెండు రోజుల్లో మార్కెట్​కు తీసుకుపోవాల్సింది. వానలు రావటం వల్ల వాగులు, వంకలల్లోకి కొట్టుకుపోయింది. దాదాపు 10 మంది కూలీలను పెట్టుకోని మిరపను వేరుకుంటున్నాము. ఒక ఎకరానికి 2 లక్షలు పెట్టుబడి పెట్టినాము. 5 లక్షల వరకు నష్టం వచ్చింది. ప్రభుత్వం ఆదుకుంటేనే మేము బతకగలం. " - మిరప రైతు

ఏమీ చేయాలో అర్థంకాక కన్నీళ్లు పెట్టుకుంటున్న రైతులు : కర్నూలు జిల్లా గోనెగండ్ల, మంత్రాలయం, ఎమ్మిగనూరు తదితర మండలాల్లో అర్ధరాత్రి దాటాక అకాల వర్షం విరుచుకుపడి కల్లంలో ఆరబెట్టిన మిరప వాన నీటిలో తేలియాడింది. ఒక్కో మిరప రైతు లక్షల్లో నష్టపోయారు. ఎకరానికి 2లక్షల రూపాయలకు పైగా అప్పు తెచ్చి పెట్టిన పెట్టుబడి తీర్చేదెలాగో అర్ధంకాక కన్నీటిపర్యంతమవుతున్నారు.

" రెండున్నర ఎకరాలు మిరప వేశాము. మిరప కోని చాలా జాగ్రత్తాగా చూసుకున్నాము. రాత్రి వచ్చి పట్టలు కప్పుదాముకుంటే పిడుగులు పడతాయని భయపడి పొలానికి రాలేక ఇంటిని పోయాము. అకాల వర్షంతో 30 క్వింటాలు కొట్టుకుపోయాయి. కూలీలను పెట్టుకోని వేరుకుంటున్నాము. " - మిరప రైతు

వందల ఎకరాల్లో దెబ్బతిన్న పంట.. కోట్ల రూపాయల్లో నష్టం : వర్షాల ధాటికి కర్నూలు, నంద్యాల ప్రకాశం జిల్లాలతో పాటు వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లోనూ మామిడి, బొప్పాయి, అరటి పంటలు వందల ఎకరాల్లో దెబ్బతిన్నాయి. కోట్ల రూపాయల్లో పంట నష్టం వాటిల్లింది. మామిడిలో కాపు రాలింది. ప్రకాశం జిల్లాలో పలుచోట్ల అరటి, బొప్పాయి చెట్లు విరిగిపడ్డాయి. నెల్లూరు, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో చేతికొచ్చే దశలో ఉన్న వరి నేలవాలింది. కొనిచోట్ల ధాన్యం రాశులు తడిచాయి. కల్లాల్లో ఆరబెట్టిన మిరప తడిసింది.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.