కర్నూలు జిల్లా నంద్యాలలో ఓ వివాహితపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. స్కూటీపై వెళుతున్న మహిళను.. కొంతమంది ద్విచక్రవాహనంతో వెనక నుంచి ఢీ కొట్టారు. వారిలో ఒకరు తన మెడపై కాలితో తొక్కినట్లు బాధితురాలు తెలిపింది. గాయపడిన వివాహితను నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ దాడిలో గాయాలపాలైన మహిళ.. అత్యాచార బాధితురాలు కావడం గమనార్హం. ఆ కేసులో ఈ నెల 3న అదిల్ బాషా అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు ఆమెపై దాడి జరగడంతో.. పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అనుబంధ కథనం: