కర్నూలు జిల్లా ఆదోనిలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. పట్టణంలోని ఆకాశ వంతన కింద 30 ఏళ్ల క్రితం దేవాలయం నిర్మించారు. సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆంజనేయ స్వామి విగ్రహం ముఖం దగ్గర పగలగొట్టారు. ఈ రోజు ఉదయం పూజలు చేయడానికి వెళ్లిన పూజారి గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: కర్నూలు జిల్లాలో అర్ధరాత్రి దొంగల హల్చల్