ETV Bharat / state

APJAC DHARNA: మే 1న విశాఖలో 'ఉద్యోగుల ఉప్పెన': బొప్పరాజు వెంకటేశ్వర్లు - AP JAC Amaravati news

apjac amaravathi dharna updates: ఏపీ జేఎసీ అమరావతి ఆధ్వర్యంలో కర్నూలు, ప్రకాశం, విజయవాడ, మన్యం జిల్లా, తిరుపతి జిల్లాల్లో ప్రభుత్వంలో పని చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులు, కార్మికులు, విశ్రాంత, కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగులు ధర్నాలు చేపట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే.. ఏపీ జెఏసీ అమరావతి పిలుపు మేరకు దశలవారీ ఉద్యమాలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. మే 1వ తేదీన విశాఖలో ఉద్యోగుల ఉప్పెన పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని ప్రకటించారు.

APJAC DHARNA
APJAC DHARNA
author img

By

Published : Apr 18, 2023, 2:11 PM IST

Updated : Apr 18, 2023, 7:00 PM IST

apjac amaravathi dharna updates: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ.. ఏపీ జేఎసీ అమరావతి ఆధ్వర్యంలో నేడు కర్నూలు జిల్లా, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, పార్వతీపురం మన్యం, విజయనగంర జిల్లాల కలెక్టరేట్ల వద్ద ప్రభుత్వ, విశ్రాంత ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఆందోళనలో భాగంగా సీపీఎస్ రద్దును చేసి ఓపీఎస్ అమలు చేయాలంటూ నినాదాలు చేశారు. అనంతరం ఉద్యోగులకు ప్రభుత్వమిచ్చిన హెల్త్ కార్డులు పని చేయడం లేదని.. కార్పొరేట్ ఆసుపత్రులకు హెల్త్ కార్డులను తీసుకెళ్తే ఆ ఆస్పత్రులవారు అంగీకరించటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి.. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

మే 1న విశాఖలో ఉద్యోగుల బహిరంగ సభ: బొప్పరాజు వెంకటేశ్వర్లు

ఓపీఎస్‌ ముద్దు-సీపీఎస్ వద్దు.. వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ ఏపీజేఏసీ అమరావతి చేపట్టిన నిరసన కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలో జోరుగా కొనసాగాయి. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలంటూ కర్నూలు నగరంలోని శ్రీ కృష్ణదేవరాయల కూడలి వద్ద ఉద్యోగులు పెద్దఎత్తున ధర్నా చేపట్టారు. ఓపీఎస్‌ను మాత్రమే తాము అంగీకరిస్తామని.. మిగిలిన వాటిని అంగీకరించబోమని ఉద్యోగులు తేల్చి చెప్పారు.

పని చేయని ఉద్యోగుల హెల్త్‌ కార్డులు.. ఏపీ జేఏసీ అమరావతి కర్నూలు జిల్లా అధ్యక్షుడు గిరి కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ''సీపీఎస్ వల్ల ఎందరో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ కార్డులు పని చేయడం లేదు. ఆ కార్టులను కార్పొరేట్ ఆసుపత్రులకు తీసుకెళ్తే.. అక్కడ వారు అంగీకరించడం లేదు. ఏ ప్రభుత్వ ఉద్యోగైనా రిటైర్మెంట్ అయిన తర్వాత ఏదైనా కారణం చేత చనిపోతే.. వారి కుటుంబానికి ఎలాంటి బెనిఫిట్స్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి.. కారుణ్య నియామకాలు చేపట్టి, రిటైర్డ్ అయిన ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్లను వెంటనే ఇవ్వాలి'' అని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

దశలవారీగా ఉద్యమాలు.. మరోపక్క ఏపీ జేఏసీ అమరావతి పిలుపు మేరకు.. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ముందు ప్రభుత్వ ఉధ్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా పలు కీలక విషయాలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అందులో ప్రధానంగా సీపీఎస్‌ను రద్దు చేసి పాత పింఛన్‌ విధానాన్నే అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో పని చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత, కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. ఇప్పటికే ఈ విషయాలపై పలుమార్లు ప్రభుత్వానికి విన్నపాలు చేసినా ఎటువంటి ఫలితం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే.. ఏపీ జెఏసీ అమరావతి పిలుపు మేరకు దశలవారీ ఉద్యమాలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సంఘ ప్రతినిధులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

మే 1న ఉద్యోగుల ఉప్పెన బహిరంగ సభ: ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలను అడ్డుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఏపీ జేఎసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. తిరుపతి కలెక్టరేట్‍ కార్యాలయం ముందు ఉద్యోగులు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఉద్యోగుల సమస్యలపై రూపొందించిన గోడ పత్రికలను విడుదల చేశారు. మే ఒకటిన ఉద్యోగుల ఉప్పెన పేరుతో విశాఖలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

''మా సమస్యలను నెరవేర్చాలని కోరుతూ.. ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలను ప్రభుత్వం అడ్డుకోవాలని ప్రయత్నిస్తుంది. మే ఒకటోవ తేదీన ఉద్యోగుల ఉప్పెన పేరుతో విశాఖలో బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారు. మా న్యాయమైన డిమాండ్లను తీర్చడంలో.. ముఖ్యమంత్రి చొరవ చూపడంలేదు. ఉద్యోగుల పట్ల మంత్రులు హేళనగా మాట్లాడం కరెక్ట్ కాదు. ప్రభుత్వానికి సమయమిచ్చాం. స్పందించకపోతే ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తాం.''-బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు

ఇవీ చదవండి

Last Updated : Apr 18, 2023, 7:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.