కర్నూలులో విషాదం చోటుచేసుకుంది. ఇటీవలే పదో తరగతి పరీక్షలు పూర్తి చేసుకున్న పట్టణానికి చెందిన ఐదుగురు స్నేహితులు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు వద్దకు ఈతకు వెళ్లారు. ఈతకొట్టే సమయంలో ప్రమాదవశాత్తు ఇద్దరు విద్యార్థులు నీట మునిగారు. మరో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. నీటిలో గల్లంతైన విద్యార్థులు సలీమ్, రఖీమ్గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని పిల్లల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదీ చూడండి
Died: ఇంటర్ పరీక్ష కేంద్రం వద్ద గుండెపోటుతో విద్యార్థి మృతి
FRAUD: రండిబాబూ రండి అన్నాడు.. అందరూ వెళ్లి బుట్టలో పడ్డారు!