ETV Bharat / state

కర్నూల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. తల్లీకూతురు మృతి! - road accident

రోడ్డు ప్రమాదంలో తల్లీకూతురు మరణించిన సంఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. కర్నూలు సమీపంలోని గార్గేయపురం వద్ద ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. జూపాడుబంగ్లా మండలం మండ్లెం గ్రామానికి చెందిన నవాజ్ భాష.. తన భార్య నసీమూన్, కూతురు సఫియ (9) తో కలిసి ద్విచక్ర వాహనంపై మండ్లెం గ్రామానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

accident
accident
author img

By

Published : Jul 9, 2022, 10:18 PM IST

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.