కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజవర్గం వక్కిలేరులోని వరద ఉద్ధృతిలో ఇద్దరు గొర్రెల కాపర్లు చిక్కుకున్నారు. నేలంపాడుకు చెందిన నరసయ్య దావీదు అనే ఇద్దరు వ్యక్తులు... ఏటికి ఆవతల ఉన్న ఉన్న గొర్రెల కాపరులకు భోజనం తీసుకుని వెళ్లి తిరిగి వస్తుండగా ఒక్కసారిగా ప్రవాహం పెరిగింది. ఇద్దరూ బయటికి రాలేక కేకలు వేయటాన్ని గమనించిన రైతులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి ఇద్దరిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
ఇవీ చూడండి-48 గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు!