కర్నూలు సమీపంలోని పెద్దటేకూర్ వద్ద జాతీయ రహదారిపై రాత్రి జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. లారీ కారును ఢీకొనటంతో ఈ ఘటన జరిగింది. మృతులు అనంతపురం జిల్లాకు చెందిన సుజిత్ కుమార్ మరియు గోవర్ధన్ రెడ్డిగా గుర్తించారు. ఉలిందకొండ పోలీసులు మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: నరసాపురం-కాకినాడ మధ్య తీరాన్ని దాటిన తీవ్రవాయుగుండం