కర్నూలు జిల్లా కల్లూరు మండలం యాపర్లపాడు గ్రామంలో ఈత సరదా ఇద్దరు బాలురను బలిగొంది. గ్రామానికి చెందిన శివానంద రెడ్డి(13), తరుణ్(13), అరుణ్.. స్నేహితులతో కలసి గ్రామ శివారులోని బావి వద్దకు వెళ్లారు. తరుణ్ ఖాళీ ప్లాస్టిక్ డబ్బాలతో ఈత కొడుతున్న సమయంలో.. ప్రమాదవశాత్తు డబ్బాలు ఊడిపోవటంతో తరుణ్ మునిగి పోయాడు. స్నేహితుడి కాపాడేందుకు శివానందరెడ్డి ప్రయత్నించే క్రమంలో ఇద్దరు మునిగిపోయారు. గట్టు మీద కూర్చున అరుణ్.. ఇదంతా గమనించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకుని బావిలో గాలించగా శివానంద రెడ్డి మృతదేహం లభించింది. ప్రత్యేక బృందానికి సమాచార మివ్వగా.. ఘటన స్థలానికి చేరుకొని తరుణ్ మృతదేహాన్ని వెలికితీశారు. బాలుర కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.
ఇదీ చదవండి