ETV Bharat / state

నంద్యాలలో వివాహితపై అత్యాచారం కేసులో ఇద్దరి అరెస్ట్ - నంద్యాలలో వివాహిత అత్యాచారం కేసులో ఇద్దరి అరెస్ట్

కర్నూలు జిల్లాలో ఓ వివాహితపై జనవరిలో అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. నిందితులను అరెస్ట్ చేయడంలో పోలీసులు అలసత్వం ప్రదర్శించారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఈ విషయంపై బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.

rape
నంద్యాలలో వివాహిత అత్యాచారం కేసులో ఇద్దరి అరెస్ట్
author img

By

Published : Mar 4, 2021, 12:37 PM IST

కర్నూలు జిల్లా నంద్యాల ఎన్జీఓ కాలనీకి చెందిన ఓ వివాహితపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు.

పట్టణంలో కోటవీధికి చెందిన అదిల్ బాషా పాతిమానగర్​లో ఉంటున్నాడు. అదిల్ బాషా, అతని మిత్రుడితో కలిసి జనవరిలో ఎన్జీఓ కాలనీలోని ఓ ఇంట్లో ఒంటరిగా ఉన్న వివాహితపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మార్చి మూడో తేదీన వారిని అరెస్టు చేశారు.

అరెస్టు చేయడంలో జాప్యంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు

తనపై అత్యాచారం చేసిన వారిని అరెస్టు చేయడంలో నంద్యాల రెండో పట్టణ పోలీసులు జాప్యం చేయడంపై బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. అత్యాచారం చేసిన అదిల్ బాషా అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి బంధువు కావడంతో పోలీసులు ఉదారంగా వ్యవహరించారని దిశ పోలీస్ స్టేషన్​ను ఆశ్రయించింది.

ఇదీ చదవండి: కనిపించకుండా పోయిన బాలుడు.. విగతజీవిగా తేలాడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.