ETV Bharat / state

arrest: ఏటీఎంలో చోరీ కేసు.. ఇద్దరు నిందితులు అరెస్ట్​..

కర్నూలు జిల్లా డోన్​లో ఆగస్టు 30న ఎస్బీఐ ఏటీఎంలో జరిగిన చోరీ కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ చేసినట్లు(Two accused arrested in ATM theft case at done) డోన్​ డీఎస్పీ​ శ్రీనివాస్​రెడ్డి తెలిపారు.

Two accused arrested in ATM theft case at done
ఏటీఎం చోరీ కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్​
author img

By

Published : Nov 9, 2021, 9:34 PM IST

కర్నూలు జిల్లా డోన్ పట్టణం నెహ్రూ నగర్​లోని ఎస్బీఐ ఏటీఎంలో గతంలో జరిగిన చోరీ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు(Two accused arrested in ATM theft case at done) చేశారు. ఆగస్టు 30న తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఏటీఎం మిషన్​ను గ్యాస్ కట్టర్​తో కట్​ చేసి రూ. 65,21,900 నగదు అపహరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. టోల్ గేట్ సీసీ కెమెరాలు, పట్టణంలోని సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

హరియాణా రాష్ట్రానికి చెందిన చోరీ ముఠా.. ఈ దొంగతనం చేసినట్లు గుర్తించామని డీఎస్పీ శ్రీనివాస్​రెడ్డి తెలిపారు. 'ముఠా నాయకుడు ఫరూక్​తో సహా ఐదుగురు ఈ చోరీలో పాల్గొన్నారు. ఫరూక్, ఆరిఫ్, ఇమ్రాన్, హసన్, ముస్తకిం.. నంబరు ప్లేట్ లేని కారులో వచ్చి దొంగతనానికి పాల్పడ్డారు(ATM theft case at done). ఈ పని కేవలం 15 నిమిషాల్లో పూర్తి చేశారు. ఫరూక్​ గతంలోనూ అనేక కేసుల్లో ప్రధానంగా నిందితుడిగా ఉన్నాడు. హైదరాబాద్​ మోహిదీపట్నంలో ఆరిఫ్, ఇమ్రాన్​ను సోమవారం అరెస్ట్ చేసి వాళ్ల వద్ద నుంచి రూ. 6 లక్షల 25వేల నగదును స్వాధీనం చేసుకున్నాం. మిగతా ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నాం' అని డీఎస్పీ వివరించారు.

ఇదీ చదవండి..: ACCIDENT: జాతరకు వెళ్లి తిరిగి వస్తుండగా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.