కర్నూలు జిల్లా గూడూరు మండలం పెంచికలపాడు వద్ద కర్నూలు-బళ్లారి ప్రధాన రహదారిలో, పెంచికలపాడు-గూడూరు రహదారిలో వందల ఏళ్లనాటి వృక్షాలు అగ్నికి ఆహుతవుతున్నాయి. పంట కాపుకు అడ్డంకిగా మారాయని కొందరు రైతులు చెట్లకు నిప్పు పెట్టి కాల్చి వేస్తున్నారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పర్యావరణ ప్రేమికులు.. ఏళ్లనాటి వృక్షాలను ఇలా బూడిదపాలు చేయడం సమంజసం కాదని ఆందోళన చెందుతున్నారు.
రహదారులకు ఇరువైపులా మొక్కలు పెంచకుండా.. ఉన్న మహా వృక్షాలను నాశనం చేయడం తగదని హితవు పలికారు. ఈ ఘటనలపై అధికారులు స్పందించి, వృక్షాలను కాల్చివేస్తున్న వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పర్యావరణ ప్రియులు కోరుతున్నారు.
ఇదీచదవండి.