transportation problems: ఏళ్లు గడుస్తున్నా.. గ్రామీణ విద్యార్థుల బడి కష్టాలు తీరడం లేదు. కిలో మీటర్లు నడిస్తే గానీ బడికి చేరుకోలేకపోతున్నారు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలకు సరైన దారులు లేకపోవడం.. ఉన్న మార్గాల్లో బస్సు సదుపాయం లేకపోవడంతో వారి కష్టాలు తీరడం లేదు. కర్నూలు జిల్లా కౌతాళం మండలం వల్లూరు గ్రామంలో దశాబ్దాలుగా ఇదే పరిస్థితి. 40 మంది విద్యార్థులు ఉదయాన్నే 4 కిలోమీటర్ల దూరంలోని బడికి వెళ్లాలి. కానీ బస్సు మధ్యాహ్నం వస్తుంది. దీంతో చేసేది లేక.. హాల్వి ఉన్నత పాఠశాలకు కొందరు కాలినడకన వెళ్తుండగా, మరికొందరు ప్రమాదకరంగా ఆటోపైన ఎక్కి వెళ్తున్నారు.
ప్రతిరోజూ ఇదేవిధంగా ప్రయాణిస్తుండటంతో ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యార్థులు పాఠశాలకు వెళ్లే సమయంలో, వచ్చే సమయంలో బస్సులు ఉండే విధంగా చూడాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి:
TIDCO HOUSES: టిడ్కో గృహాల లబ్ధిదారులకు శుభవార్త.. త్వరలోనే 45 వేల ఇళ్లు అందజేత!